ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు మాత్రమేనని వెల్లడించారు. తమ దాడుల వల్ల ఏ ఒక్క అరబ్ దేశానికి కూడా ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తమ భూభాగాన్ని ఆక్రమించడానికి యత్నిస్తున్నాయని.. చివరి బుల్లెట్ వరకు ప్రతిఘటించడం తప్ప మరో మార్గం లేదన్నారు.