యువకుడికి కంటిలోకి చేపల గేలం.. అత్యవసర శస్త్రచికిత్స
BPT: కంటిపైన చేపల గేలం గుచ్చుకుపోవడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం బాపట్ల ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థ నాయకత్వంలో ప్రత్యేక బృందం చికిత్స ప్రారంభించింది. ఎలాంటి ప్రమాదం లేకుండా గేలాన్ని విజయవంతంగా తొలగించారు. కంటి దెబ్బతినకుండా నిరంతరం పరిశీలిస్తున్నామని సిద్ధార్థ తెలిపారు. బాలుడు కుటుంబ సభ్యులు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.