నందిగామలో టెర్రస్ గార్డెన్స్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

నందిగామలో టెర్రస్ గార్డెన్స్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణం 15వ, 16వ వార్డులలో శనివారం ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్స్‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఇంటింటా పాక్షికంగా ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్స్‌ను పరిశీలిస్తూ పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల పైభాగాల్లో చిన్న తోటలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.