రైల్వే పనితీరుపై విద్యార్థులకు అవగాహన

HYD: RR జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లి వీఐపీ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం రైల్వే పనితీరు పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇప్పలపల్లి నుంచి షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని క్షేత్రస్థాయిలో రైళ్ల రాకపోకలు, టిక్కెట్ కౌంటర్, బోగీల అమరిక, స్టేషన్ మాస్టర్ విధులు, రవాణా సౌకర్యం, మొదటి, రెండవ క్లాస్‌తో పాటు రైల్వే భద్రత చర్యల గురించి విద్యార్థులకు వివరించారు.