విద్యార్థులకు 'గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్' అవగాహన కార్యక్రమం
కృష్ణా: డోకిపర్రు SVVR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఐ సోమేశ్వరరావు 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బాలికలకు 'బ్యాడ్ టచ్' సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో వివరించారు. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా డయల్ 112 లేదా 1930 కు ఫోన్ చేయాలని సూచనలు చేశారు.