వడగండ్ల వానకు మామిడి నేలపాలు

వడగండ్ల వానకు మామిడి నేలపాలు

సత్యసాయి: బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం పంచాయతీ ధూపంపల్లిలో బుధవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన మామిడి రైతులకు తీరని నష్టం మిగిల్చింది. అకస్మాత్తుగా వాతావరణం మారి ఈదురుగాలులతో భారీ వర్షం పడటంతో కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి గురికావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.