గోనెగండ్లలో మళ్లీ చిరుత సంచారం

గోనెగండ్లలో మళ్లీ చిరుత సంచారం

KRNL: గోనెగండ్ల మండలంలో చిరుత సంచారంతో గంజిహళ్లి, ఎన్నెకండ్ల గ్రామాల్లో నివాసితులకు భయాందోళన కలిగింది. వారం క్రితం, గంజిహళ్లి శివారులో చిరుత దున్నపోతుపై దాడి చేసి చంపింది. శుక్రవారం తిరిగి గంజిహళ్లి పంట పొలాల్లో చిరుత కనిపించడంతో రైతులు, కూలీలు పరుగులు తీశారు. ఫారెస్టు అధికారులకు సమాచారం అందించినప్పటికీ, స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.