VIDEO: ఘనంగా తలుపులమ్మ తొలి జాగారం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రెండో వార్డు బీసీ కాలనీలో తలుపులమ్మ పండగ పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం తొలి జాగారం నిర్వహించారు. ఈ సందర్భంగా గరగలను వీధులలో ఊరేగించారు. ఇంటింటికి వచ్చిన గరగలను దర్శించుకున్న మహిళా భక్తులు నీటి బిందెలతో స్వాగతం పలికారు. సోమవారం రెండో జాగారం, మంగళవారం అమ్మవారి పండుగ నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.