సింగూర్ ప్రాజెక్టులో స్వల్పంగా పెరిగిన వరద

సింగూర్ ప్రాజెక్టులో స్వల్పంగా పెరిగిన వరద

MDK: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో స్వల్పంగా వరద పెరిగింది. 5852 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి స్టాలిన్ గురువారం తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం మనూర్, న్యాల్కల్, పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. సింగూరులో నీటిమట్టం 16.886 టీఎంసీల వద్ద నిల్వ ఉంది.