అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టివేత
NRPT: మద్దూరు మండలంలోని సూరారం వాగు నుంచి అక్రమంగా ఇసుక నింపుకుని గుండుమల్ వైపు తరలిస్తున్న టిప్పర్‌ను ఆదివారం లింగాల్ చెడ్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. డ్రైవర్ శివకుమార్, యజమాని వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.