'రైతు భరోసా కోసం దరఖాస్తులు సమర్పించాలి'

'రైతు భరోసా కోసం దరఖాస్తులు సమర్పించాలి'

PDPL: రైతు భరోసా పథకం కోసం కొత్తగా పాస్ పుస్తకం పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ధర్మారం మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఇవాళ తెలిపారు. 28-02-2026 లోపు భూమి పాసుపుస్తకం పొందినవారు ఈనెల 25 లోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఇదివరకు రైతు భరోసా జమ అవుతున్నవారు బ్యాంకు అకౌంట్ మార్పు కోసం సైతం సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించాలని తెలిపారు.