అధికారులకు సవాలుగా "పెద్దపులి "

అధికారులకు సవాలుగా "పెద్దపులి "

KKD: ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెద్దపులి అధికారులకు సవాలుగా మారింది. 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తు మూగ జీవులను బలి తీసుకుంటోంది. పులిని సురక్షితంగా బంధించటానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. శంఖవరం(M) ఊరకొండపై ప్రస్తుతం పులి సంచరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసి పులి కదలికలు పర్యవేక్షిస్తున్నారు.