అరటి రైతులను ఆదుకోవాలి: మాజీ మంత్రి
నంద్యాల: ప్యాపిలి మండలంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మంగళవారం పర్యటించారు. హుసేనాపురం గ్రామం నుంచి రంగాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లోని రైతన్నలు తమ పంటలకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అరటిపంట రైతులకు గిట్టుబాటు ధరలు, ఎగుమతులు లేక పంటలు నష్టపోతున్నారు. రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.