చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: నిమ్మల

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: నిమ్మల

AP: గతంలో పంట విక్రయానికి రైస్ మిల్లుల వద్ద పడిగాపులు గాచే పరిస్థితి ఉండేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు అమ్ముకునే వెసులుబాటు ఉందని తెలిపారు. మాజీ సీఎం జగన్ రైతులకు ఎగ్గొట్టిన రూ.1654 కోట్ల ధాన్యం బకాయిలను చెల్లించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వమే చివరి గింజ వరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు