సన్నబియ్యం లబ్దిదారులతో కలిసి MLA సహపంక్తి భోజనం

MNCL: కన్నెపల్లి మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను MLA వినోద్ ప్రారంభించారు. సుజాపూర్‌లో కోటి 20 లక్షలతో నిర్మించిన BT రోడ్ ప్రారంభం, ఎల్లారం గ్రామంలో కోటి 60 లక్షలతో నిర్మించిన BT రోడ్ లను ప్రారంభించారు. అనంతరం ఎల్లారం గ్రామంలో సన్న బియ్యం లబ్దిదారులతో కలిసి MLA సహపంక్తి భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీ పేదలకు ఒక వరమన్నారు.