VIDEO: మేనేజర్ కుమార్తె బారసాలకు చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె బారసాలకు సతీసమేతంగా హాజరై సందడి చేశారు. చిరంజీవి, సురేఖ దంపతులు చిన్నారిని ఆశీర్వదించారు. స్వామినాథ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. స్టార్ హీరో అయినప్పటికీ తన సిబ్బంది కుటుంబ వేడుకకు హాజరైన చిరంజీవి నిరాడంబరతను అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.