విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
VZM: గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మంత్రి విద్యార్థులతో కలిసి క్యూలైన్లో నిలుచుని భోజనాన్ని స్వీకరించారు. మధ్యాహ్నం భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రకాశరావు, హెచ్ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.