యువకుడు హత్య.. నిందితులను పట్టుకుంటాం: DSP
MDK: చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఓ యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. మృతుడు జార్ఖండ్‌కు చెందిన దేవ ఇమ్రాన్‌గా గుర్తించామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని వెల్లడిచారు.