'సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి'

SRD: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 20వ తేదీన సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ ఆందోలు డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ కోరారు. జోగిపేట ఏరియా ఆసుపత్రి సౌజన్యకు సార్వత్రిక సమ్మె నోటీసులు మంగళవారం అందించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.