విజయవాడలో నేడు ఏఐ సమ్మిట్
NTR: విద్యార్థులు, అధ్యాపకులు, వ్యాపారవేత్తలకు ఏఐపై ఉన్న సందేహాలు తొలగించేందకు విజయవాడలో నేడు ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఏపీ డీటీఐ తెలిపింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న మొదటి అతి పెద్ద ఏఐ సమ్మిట్ ఇదే అని నిర్వహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ, రిలయన్స్, జియో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల నుంచి 20 మంది గ్లోబల్ ఏఐ ఎక్స్‌పర్ట్స్ పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు.