వేధిస్తున్న భర్త పై ఫిర్యాదు చేసిన భార్య

వేధిస్తున్న భర్త పై ఫిర్యాదు చేసిన భార్య

ప్రకాశం: జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో, కొలుకుల గ్రామానికి చెందిన ఒక వివాహిత తన భర్త కృష్ణ నాయక్ మరియు అతని చిన్నమ్మ వేధిస్తున్నారని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన ఈ మహిళ, వేధింపుల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.