రేపు తడ్కల్ లో వరి కోనుగోలు కేంద్రం ప్రారంభం
SRD: కంగ్టి మండల తడ్కల్‌లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కోనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు సీసీ అనసూయ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2368, సన్న రకానికి బోనస్ రూ.500 నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.