డయాలసిస్ పేషంట్‌కు పింఛన్ అందించిన కలెక్టర్

NLR: మూలాపేట ఈఎస్ఆర్ఎం స్కూలు సమీపంలో జరిగిన పింఛన్ల పంపిణీలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. మంచానికే పరిమితమైన డయాలసిస్ పేషంట్ సిరివెళ్ల శ్రీనివాస్‌కు రూ. 15వేలు, ఒంటరి మహిళ శారదకు రూ. 4 వేలు నగదు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్దకు కలెక్టర్ వచ్చి నగదు అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.