VIDEO: నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

తూ.గో: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బిక్కవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో నీటి మునిగిన పంట పొలాలను శనివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. అధికారులు, కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.