బంగారు పతకం సాధించిన విద్యార్థి

బంగారు పతకం సాధించిన విద్యార్థి

అన్నమయ్య: బద్వేల్‌లోని బీజీవేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలలో బుధవారం జరిగిన యోగి వేమన అంతర్‌ విశ్వవిద్యాలయ క్రీడా పోటీల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో వీరబల్లికి చెందిన ఓ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి ఇస్మాయిల్ బంగారు పతకం సాధించాడు. విశ్వవిద్యాలయ అధికారులు, నిర్వాహకుల చేత అతను బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.