యువకుడి గల్లంతుపై మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆరా
PDPL: మంథని గోదావరి నదిలో యువకుడి గల్లంతుపై సోమవారం మంథనిలో చర్చనీయాంశమైంది. ఉదయం స్నానానికి వెళ్ళిన మంథని పట్టణానికి చెందిన రావికంటి సాయికుమార్ కాలు జారీ లోతులోకి పోవడం మూలంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు అధికారులను అప్రమత్తం చేయడంతో గాలింపు చేపట్టారు. అలాగే మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘటనపై ఆరా తీశారు.