మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు
WGL: నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారం వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని, గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమని పెద్ది అన్నారు. మునుముందు పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.