'ఆస్థి హక్కు కల్పించేందుకు సౌమత్వ కార్యక్రమం'

KDP: ఇండ్ల స్థలాలపై ఆస్థి హక్కు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సౌమత్వ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా పంచాయతీ అధికారిణి రాజ్యలక్ష్మి తెలిపారు. సిద్దవటం మండల పరిషత్ సభా భవనంలో శనివారం పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లతో సౌమత్వపై సమీక్షించారు. రాష్ట్రంలో సౌమత్వలో కడప జిల్లా 4వ స్థానంలో ఉందని అన్నారు.