BREAKING: విశాఖలో భారీ పేలుడు..!
VSP: గోపాలపట్నంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి, దట్టంగా పొగ అలుముకపోవడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.