'ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవు'
RR: కొత్తూరు మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో CI నరసయ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ DCP రాజేష్ పాల్గొని మాట్లాడుతూ.. రేపు జరిగే సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.