యూరియా కొరత రోడ్డుపై రైతుల ధర్నా

యూరియా కొరత రోడ్డుపై రైతుల ధర్నా

MBNR: యూరియా కొరతను నిరసిస్తూ నగరంలోని లాల్కోట చౌరస్తాలో రైతులు నిన్న ధర్నాకు దిగారు. పంట కాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు.