బాలుడి పై వీధి కుక్కల దాడి
MNCL: పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీనగర్‌లో హర్షవర్ధన్ అనే బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి కుక్కలను తరమడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.