శ్రీకృష్ణ విగ్రహ నిమజ్జనోత్సవం

ELR: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారి విగ్రహ నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. కృష్ణాష్టమిని పురస్కరించుకుని శనివారం భీమడోలు జంక్షన్‌లోని రాజస్థానీ కుటుంబీకులు స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు, భజనలు నిర్వహించారు. ఇవాళ గ్రామోత్సవంగా భీమడోలు జంక్షన్ నుంచి స్థానిక గోదావరి కాలువకు తీసుకువచ్చి నిమజ్జనం చేశారు.