VIDEO: ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలి: కలెక్టర్
NGKL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి గ్రామంలో గ్రామ సభలో నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి జిల్లా అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని ఆదేశించారు.