మదనపల్లెలో ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్

మదనపల్లెలో ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్

అన్నమయ్య: మదనపల్లె MLA కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రజాదర్బార్‌లో మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ 12 సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. ఈ మేరకు స్థానిక రెవిన్యూ, MPDO కార్యాలయాల్లో పరిష్కారం లభించకపోవడంతో, వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలకు తక్షణ పరిష్కారం కోరుతున్నారు.