VIDEO: వింత చోరీ.. కొబ్బరి బొండాల దొంగతనం
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని విశ్వనాథ్ రెడ్డి కాంప్లెక్స్ వద్ద శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొబ్బరి బొండాలను దొంగతనం చేసిన ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో అక్కడ ఉన్న కొబ్బరి బొండాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం గమనించిన వ్యాపారి కొబ్బరి బొండాలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.