కారుకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలం పాత మసీదు వీధిలో నిలిపి ఉంచిన కారుకు శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితుడు అన్వర్ బాషా వాపోయారు. తన ఇంటి సమీపంలో ఉన్న వాహనంపై పెట్రోలు పోసి నిప్పు పెట్టడంతో కారు పూర్తిగా కాలిపోయిందని ఆయన తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.