కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నియంత్రణ కోసం దేశ రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమని వెల్లడించింది. పర్యావరణ ఆందోళనలు, అభివృద్ధి మధ్య సమతుల్యం ఉండాలని సూచించింది.