నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో
NGKL: వెల్దండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఇవాళ కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలి విడతలో వెల్దండ మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ జోరందుకుంది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూపరింటెండెంట్ మోహన్‌లాల్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గిరి గౌడ్, వాణి, ఫయాజ్, తదితరులు ఉన్నారు.