అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా ఉంటారని విశ్వసిస్తున్నా: మోదీ

ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఆయన జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకు అంకితం. అణగారినవర్గాల సాధికారతకు ఆయన జీవితం అంకితం చేశారు. రాజ్యాంగ విలువలను ఆయన బలోపేతం చేస్తారని ఆశిస్తున్నా. అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా ఉంటారని విశ్వసిస్తున్నా' అని పేర్కొన్నారు.