నగరంలో మారథాన్.. ఈ రోడ్లు బంద్

HYD: రేపు జరగనున్న 14వ HYD మారథాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉ.5 నుంచి 11:30 గం.వరకు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కవాడిగూడ- సైబర్ టవర్స్ మార్గం ఉ.7:15 వరకు, IKEA-సైబర్ టవర్స్, రోడ్ నం.45 ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జి మూసేస్తారు.