'బాలుర వసతి గృహం ఏర్పాటు చేయాలి'
BHNG: చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల బాలుర కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు. సోమవారం రోజున ఆయన ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షులు దాసరి ప్రకాష్‌తో కలిసి భువనగిరి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. హాస్టల్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగం ఉంటుందన్నారు.