ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో FACS ఆధ్వర్యంలో ఏర్పాటైన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను పరిశీలించగా, ధాన్యం కొనుగోలు ఆలస్యం, లారీల కొరత ఉన్నట్లు గుర్తించారు. వెంటనే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం కోరారు.