ఆలయాల అభివృద్ధికి రూ.4.80 కోట్ల నిధుల మంజూరు
కోనసీమ: కొత్తపేటలోని మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి వారి తైలాభిషేకం మండపం నిర్మాణానికి రూ.3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేటలోని వాడపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాకు ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలోని వివిధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4.80 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.