గర్భణీలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

గర్భణీలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

PPM: గర్భిణుల నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, విద్యా విషయాలపై అవగాహన కల్పించడం ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఛాంబర్‌లో పోషణ పక్వాడ పక్షోత్సవాల పోస్టరును కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం పుట్టబోయే బిడ్డకు మంచిదన్నారు.