దారి తప్పిన దంపతులను రక్షించిన పోలీసులు

దారి తప్పిన దంపతులను రక్షించిన పోలీసులు

PLD: చేపల వేట కోసం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన కొడమంచిలి శ్రీను దంపతులు ఏప్రిల్ 19న పల్నాడు జిల్లా జెండాపెంట వద్దకు వచ్చారు. అయితే మే 2న కృష్ణా నదిలో వేటకు వెళ్లిన వారు దారి తప్పి అడవిలో చిక్కుకున్నారు. నీరు, ఆహారం లేకుండా రాత్రంతా గడిపిన వారు మే 3న డయల్‌ 100కు ఫోన్‌ చేయగా, వెల్దుర్తి ఎస్‌ఐ సమందర్ వెంటనే స్పందించి వారిని రక్షించారు.