కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
NRPT: ఉట్కూర్ మండలం తిప్రాస్పల్లి గ్రామంలో లబ్ధిదారులకు సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ శనివారం కళ్యాణలక్ష్మి చెక్కులు అందించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.