గీత కార్మికులకు రక్షణ కవచం సేఫ్టీ మోకుల పంపిణీ

HNK: కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకులు తీసుకున్న ప్రతిగీత కార్మికుడు ఉపయోగించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ కోరారు. మంగళవారం పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో బీసీ వెల్ఫేర్, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో బుర్ర శ్రీనివాస్ గౌడ్ కార్మికులకు కిట్ల పంపిణీ చేశారు. బీసీ వెల్ఫేర్ అధికారి రామ్ రెడ్డి పాల్గొన్నారు.