VIDEO: బ్యాంక్‌లో చోరీకి యత్నం.. కేసు నమోదు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో గుర్తుతెలియని దుండగులు ఈ రోజు తెల్లవారుజామున చోరీకి యత్నించారు. గ్యాస్ కట్టర్‌తో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేయడానికి ప్రయత్నించగా సైరన్ మోగడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.