'దళితుల సమస్యలను పరిష్కరించడం బీవీతోనే సాధ్యం'

'దళితుల సమస్యలను పరిష్కరించడం బీవీతోనే సాధ్యం'

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో టీడీపీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళితుల సమస్యలపై పోరాడాలన్నా, వాటిని పరిష్కరించాలన్నా అది కేవలం ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర్ రెడ్డితోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దళితుల సంక్షేమం పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధిని ఆమె కొనియాడారు.